ఆగస్టు 1న శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు విడుదల
- July 30, 2022
తిరుమల: తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు టీటీడీ విడుదల చేయబోతోంది. ఆగస్టు 1న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. 600 శ్రీవారి పవిత్రోత్సవాల టికెట్లు జారీ చేయనున్నట్లు పేర్కొంది. టికెట్‌కు 2వేల 500 చెల్లించి బుక్ చేసుకోవచ్చని చెప్పింది. మూడు రోజుల పాటు స్నపన తిరుమంజనం, చివరి రోజు పూర్ణాహుతిలో పాల్గొనవచ్చని తెలిపింది.
ఆగస్టు 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఆగస్టు 7న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటితో ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తారు.
పవిత్రోత్సవాల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో ఉదయం 7గంటలకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-1 చేరుకోవాలి. టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ ఫోటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. మరోవైపు టీటీడీ తరఫున నిర్వహించే..కల్యాణమస్తు కార్యక్రమం వచ్చే నెల 7న ఏపీ వ్యాప్తంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







