రవితేజ సినిమాకి వెళ్లి పవిత్రా లోకేష్‌కి జై కొట్టారేంటబ్బా.!

- July 30, 2022 , by Maagulf
రవితేజ సినిమాకి వెళ్లి పవిత్రా లోకేష్‌కి జై కొట్టారేంటబ్బా.!

రవితేజ సినిమా ఫట్ అయ్యింది. కానీ, ఆ జంట మాత్రం సూపర్ హిట్ అయ్యింది.! ఏంటా సినిమా.? ఎవరా సూపర్ హిట్ జంట అంటారా.? ఈ మధ్య నరేష్, పవిత్రా లోకేష్ జంట ఎంత సెన్సేషనల్ అయ్యిందో తెలిసిందే కదా.

ఆ సెన్సేషనల్ ఇష్యూ తర్వాత వచ్చిన సినిమా ‘రామారావు ఆన్ డ్యూటీ’. మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా లేటెస్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 
ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు నరేష్, పవిత్రా లోకేష్. హీరో ఎలివేషన్ సీన్స్‌కి లేని అప్లాజ్, ఈ జంట తెరపై కనిపించినప్పుడల్లా వచ్చిందంటే, ఈ జంటకు ఎంత పాపులారిటీ దక్కిందో అర్ధం చేసుకోవచ్చు.

ఆ రేంజ్‌లో ఈ జంట సెన్సేషనల్ అయ్యింది మరి. నరేష్, పవిత్రా లోకేష్ ఎప్పుడు తెరపై కనిపించినా, హై ఓల్టేజ్ ఎనర్జీ.. విజిల్స్‌తో ఫ్యాన్స్ రెచ్చిపోయారు ధియేటర్లలో.
కాగా, పవిత్రా లోకేష్, నరేష్ రిలేషన్ షిప్ విషయమై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఈ మధ్య పోలీసులనాశ్రయించిన సంగతి తెలిసిందే. ఓయో రూమ్‌లో తన భర్త నరేష్‌తో పాటూ, పవిత్రా లోకేష్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మీడియాలో ఈ న్యూస్ రచ్చ రచ్చ చేసిన సంగతి కూడా తెలిసిందే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com