కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ ఈవెంట్లో విషాదం.!
- July 30, 2022
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ సినిమా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో దారుణమైన విషాదం జరిగింది. ఈవెంట్ జరుగుతుండగా ఓ అభిమాని చనిపోయాడు.
అకస్మాత్తుగా జరిగిన ఈ విషాద ఘటన వెనుక అనేక రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్. అయితే, ఆనారోగ్య కారణాలతో ఆ అభిమాని చనిపోయాడని తేల్చారు. ఈ విషాద ఘటన పట్ల ‘బింబిసార’ యూనిట్ సంతాపం తెలియ చేసింది.
కాగా, ‘బింబిసార’ సినిమా కోసం కళ్యాణ్ రామ్ చాలా కష్టపడ్డాడు. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా కంప్లీట్ మేకోవర్ చూపించాడు. ప్రాచీన రాజు బింబిసారుడి కథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బింబిసారుడి పాత్రలో రెండు వేరియేషన్స్లో కళ్యాణ్ రామ్ కనిపించనున్నాడు.
ఓ పాత్ర కోసం నెగిటివ్ షేడ్స్ చూపించబోతున్నాడు కళ్యాణ్ రామ్. వశిష్ట దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా, ‘భీమ్లా నాయక్’ భామ సంయుక్తా మీనన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే, మరో ముద్దుగుమ్మ కేథరీన్ ఇంకో హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







