వివిధ కేసుల్లో 78 మందిని అరెస్టు చేసిన నజహా
- July 31, 2022
రియాద్: లంచం, మనీ లాండరింగ్ మరియు ఫోర్జరీ కేసుల్లో ఇప్పటి వరకు 78 మందిని అరెస్టు చేసినట్లు సౌదీ అరేబియా అవినీతి నిరోధక శాఖ(Nazaha) ప్రకటించింది.
దేశవ్యాప్తంగా ఉన్న అవినీతి ఆరోపణల కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో నజహా విభాగం క్రియాశీలకంగా వ్యవహరించడం మొదలు పెట్టింది.
ఇప్పటికే రక్షణ , ఆరోగ్య , న్యాయ , విద్యా, మున్సిపల్ మరియు గ్రామీణ వ్యవహారాలు& హౌసింగ్ మంత్రిత్వ శాఖ ల పరిధిలో ఉన్న అవినీతి ఆరోపణల కేసులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన నజహా అవినీతికి పాల్పడిన వారిని అరెస్టు చేసినట్లు నాజా అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకు 78 మందిని అరెస్ట్ చేయగా మరో 116 మంది పై వివిధ కేసుల్లో విచారణ జరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. అయితే అరెస్ట్ చేసిన 78 మంది నిందితుల్లో పలు కారణాలతో బెయిల్ మీద విడుదల అయ్యారు.
దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పాల్పడుతున్న వారిపై ప్రజలు నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చని నజహా ప్రతినిధులు తెలిపారు. ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 980 , ఈమెయిల్ ఐడి: [email protected] లను ప్రకటించారు.
తాజా వార్తలు
- ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ అల్-ఇస్సాతో భారత రాయబారి విపుల్ భేటీ
- దృష్టి కోసం ఐక్యంగా.. డెట్రాయిట్లో శంకర నేత్రాలయ 5K వాక్ విజయవంతం
- దుబాయ్‌లో 35 పాఠశాలల సెక్యూరిటీ గార్డులకు ట్రాఫిక్ భద్రతపై శిక్షణ
- అర్జెంటీనాకు ఆరోగ్య సేవలను అందించనున్న భారత్
- హోర్ముజ్ జలసంధిలో నౌకాయాన భద్రతపై ఒమన్, ఖతార్‌తో కువైట్ విదేశాంగ మంత్రి చర్చలు
- ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్ దేశాల్లో 4 రోజుల పర్యటనకు బయలుదేరిన ప్రధాని మోదీ
- సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక నిబంధనలు
- భారత్–యూఏఈ విమాన చార్జీల్లో భారీ తగ్గింపు..!!
- భారత్–కువైట్ రక్షణ బంధం మరింత బలోపేతం..!!
- సౌదీ కస్టమ్స్ భారీ డ్రగ్స్ ముఠా కుట్ర భగ్నం..!!







