డా. భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు పార్లమెంట్ లో

- April 13, 2016 , by Maagulf
డా. భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు   పార్లమెంట్ లో

పార్లమెంట్ ఆవరణలో డా. భీమ్‌రావ్ అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన ప్రధాని నరేంద్రమోదీ అంబేద్కర్ జై భీమ్, విశ్వ మానవ్ అంటూ ట్వీట్ చేశారు. కాగా అంబేద్కర్ జన్మస్థలం మధ్యప్రదేశ్‌లోని మహూలో ప్రధాని పర్యటించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com