కాలిఫోర్నియాలో కార్చిచ్చు..

- August 01, 2022 , by Maagulf
కాలిఫోర్నియాలో కార్చిచ్చు..

లాస్ ఏంజిల్స్‌: కాలిఫోర్నియాలో కార్చిచ్చు ర‌గులుతోంది. వంద‌ల సంఖ్య‌లో అగ్నిమాప‌క సిబ్బంది ఆ మంట‌ల్ని ఆర్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. శుక్ర‌వారం రోజున ఉత్త‌ర సిస్కియో కౌంటీలో అగ్ని రాజుకున్న‌ది. ఇప్ప‌టికే ఆ ప్రాంతంలో 21 వేల హెక్టార్ల‌లో అడువులు ద‌గ్ధం అయ్యాయి. ప‌సిఫిక్ క్రెస్ట్ ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వేల మంది నివాసితులు, ట్రెక్క‌ర్లు ఆ ప్రాంతాన్ని వీడివెళ్లారు. ప్ర‌స్తుతం కాలిఫోర్నియాలో రెడ్ అల‌ర్ట్ జారీ చేశారు. ప్ర‌మాద‌క‌ర స్థాయిలో కార్చిచ్చు ఉన్న‌ట్లు హెచ్చ‌రించారు. సిస్కియో కౌంటీలో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద కార్చిచ్చు ఘ‌ట‌న అని అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com