జూలైలో శ్రీవారి హుండీకి భారీ ఆదాయం
- August 01, 2022
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా శ్రీవారి హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. తాజాగా జూలై నెలలో శ్రీవారి హుండి ఆదాయం అత్యధికంగా నమోదు అయింది. టీటీడీ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్వామివారికి 139.45 కోట్ల హుండి ఆదాయం వచ్చి చేరింది.దీంతో వరుసగా ఐదో నెల 100 కోట్లు దాటి శ్రీవారి హుండి ఆదాయం నమోదు అయింది.
ఈ ఏడాది మార్చి నెలలో 128 కోట్లు, ఏప్రిల్ మాసంలో 127.5 కోట్లు, మే నెలలో 130.5 కోట్లు, జూన్ లో 123.76 కోట్ల రూపాయలు హుండీ ద్వారా టీటీడీకి ఆదాయం లభించగా, జూలై మాసంలో హుండీ ద్వారా ఏకంగా 139.45 కోట్ల ఆదాయం లభించింది.చివరి నాలుగు మాసాల్లో 649.21 కోట్ల రూపాయలు స్వామి వారికి కానుకలు అందాయి.వరుసగా ఐదో నెల 100 కోట్ల మార్కును శ్రీవారి హుండీ ఆదాయం దాటింది.జూలై నెలలోనే ఐదుసార్లు 5 కోట్ల రూపాయల మార్క్ ని హుండీ ఆదాయం చేరగా, జూలై 4వ తేదీన స్వామి వారికి 6.18 కోట్ల హుండీ ఆదాయం లభించింది.ఒక్క రోజులో ఎక్కువ ఆదాయం నమోదైంది జూలై 4వ తేదీన కావడం విశేషం.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







