మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లాల్ సింగ్ చెడ్డా నుంచి థీమ్ పోస్టర్ విడుదల
- August 01, 2022
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి సమర్పణ (తెలుగు) లో వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతకంపై మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్, కరీనా కపూర్, అక్కినేని నాగ చైతన్య నటీ నటులుగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "లాల్ సింగ్ చెడ్డా". హాలీవుడ్ లో సూపర్ హిట్ అయినటువంటి ఫారెస్ట్ గంప్ సినిమా ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా కొరకు ప్రేక్షకులు ఎంతో క్యూరియాసిటీ గా ఎదురు చూస్తున్నారు.ఇందులో టాలీవుడ్ యువ హీరో నాగ చైతన్య బాలరాజు గా కీలక పాత్రలో అమీర్ ఖాన్ తో కలిసి సైనికుడిగా కనిపిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండడం విశేషం .అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన థీమ్ పోస్టర్ విడుదలైంది. మనం కథలోనా, కథే మనలోనా, ఏంటో ఈ విచిత్రం అనే పదాలుతో తయారైనా ఈ పోస్టర్ ప్రస్తుతం ప్రేక్షక వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
నటీనటులు
ఆమిర్ ఖాన్, కరీనా కుమార్, నాగ చైతన్య తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ – మెగాస్టార్ చిరంజీవి
బ్యానర్లు – వైయకామ్ స్టూడియోస్, పారామౌంట్ పిక్చర్స్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్
నిర్మాతలు – ఆమిర్ ఖాన్, కిరణ్ రావు, జ్యోతి దేశ్ పాండే, అజిత్ అంధారే
దర్శకత్వం – అద్వైత్ చందన్
సంగీతం – ప్రీతిమ్
భారతీయ చిత్రానుకరణ – అతుల్ కుల్ కర్ణి
పి. ఆర్. ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్
తాజా వార్తలు
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
- వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్‌లో భారీ మార్పులు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం









