నిఖిల్‌కి అనుపమ కౌంటర్: ప్రమోషన్స్‌కి రాకపోవడానికి కారణం అదే.!

- August 01, 2022 , by Maagulf
నిఖిల్‌కి అనుపమ కౌంటర్: ప్రమోషన్స్‌కి రాకపోవడానికి కారణం అదే.!

నిఖిల్ సిద్దార్ధ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కార్తికేయ 2’. ఈ సినిమా జూలై 22న ప్రేక్షకుల ముందుకు రావల్సి వుంది. కానీ, పోస్ట్ పోన్ అయ్యి ఆగస్టు 12న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్లు షురూ చేశారు చిత్ర యూనిట్.

అయితే, ప్రమోషన్లలో అనుపమ కో ఆపరేట్ చేయట్లేదు.. అంటూ నిఖిల్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ స్టేట్‌మెంట్ పాస్ చేశాడు. షూటింగ్ అంటే తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి కూర్చునే అనుపమ, ప్రమోషన్‌కి మాత్రం అస్సలు హాజరు కాదంటూ నిఖిల్ బహిరంగంగానే చెప్పేశాడు.

అయితే, నిఖిల్ మాటలకు అనుపమ తన సోషల్ మీడియా వేదిక ద్వారా రెస్పాండ్ అయ్యింది. ప్రమోషన్లకు రావడానికి తనకేం ఇబ్బంది లేదనీ, కానీ, వేరే సినిమాలతో బిజీగా వుండడం వల్ల షెడ్యూల్స్ సెట్ కావడం లేదనీ చెప్పింది. 

అంతేకాదు, ‘కార్తికేయ 2’ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవ్వడం కూడా తాను ప్రమోషన్లకు హాజరు కాకపోవడానికి ఓ కారణం అనీ అనుపమ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రెండు సినిమాల షూటింగులతో అనుపమ బిజీగా వుందట. అందుకే డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోతోందట ‘కార్తికేయ 2’ ప్రమోషన్స్ కోసం. 

చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ‘కార్తికేయ 2’ ఇటు నిఖిల్‌కీ, అటు అనుపమకీ ఇద్దరికీ ఇంపార్టెంటే. ఈ సినిమాపై ఇద్దరూ భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందబోతున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com