12 మందితో ఏర్పాటు కానున్న కువైట్ నూతన మంత్రివర్గం
- August 01, 2022
కువైట్ సిటీ: 12 మంది సభ్యులతో కువైట్ నూతన మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు నూతన ప్రధాని షేక్ అహ్మద్ నవాఫ్ అల్ సభా వెల్లడించారు.
గత మంత్రివర్గంలో పనిచేసిన ఆర్థిక, ఆయిల్, విదేశాంగ మంత్రులు తిరిగి అదే శాఖల మంత్రులుగా నియమితులయ్యారు.
రక్షణ మంత్రిగా మరియు ఉప ప్రధాని గా షేక్ తలాల్ ఖాలేద్ అల్ అహ్మద్ అల్ సభా నియమితులయ్యారు.
షేక్ నావాఫ్ తన కుమారుడు షేక్ అహ్మద్ కోసం ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో అహ్మద్ ప్రధాని పదవి చేపట్టారు.
మంత్రి వర్గం కుర్పును సిద్ధం చేసుకున్న తర్వాత షేక్ అహ్మద్ మర్యాద పూర్వకంగా యువరాజు అమీర్ షేక్ మేషాల్ అల్ అహ్మద్ అల్ సభా ను కలిశారు.
నూతన ప్రధాని దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!