తెలంగాణ కరోనా అప్డేట్
- August 01, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 39వేల 320 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 771 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 289 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 53 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 47 కేసులు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 33 కేసులు, కరీంనగర్ జిల్లాలో 31 కేసులు, నల్గొండ జిల్లాలో 28 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 581 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 20వేల 617 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 10వేల 773 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 773గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 32వేల 834 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 705 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!