‘కార్తికేయ 2’పై నిఖిల్ ధీమా: కారణమేంటంటే.!

- August 02, 2022 , by Maagulf
‘కార్తికేయ 2’పై నిఖిల్ ధీమా: కారణమేంటంటే.!

నిఖిల్ సిద్దార్ధ్ నటించిన ‘కార్తికేయ 2’ ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాపై పాజిటివ్ బజ్ బాగానే వుంది. కానీ, ఇదే రోజు నితిన్ నటిస్తున్న ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా పక్కా మాస్ మూవీ. నితిన్ మాస్ రోల్‌లో భీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్, మాస్ పల్స్ వున్న డైలాగులతో రెచ్చిపోతున్నాడు. నితిన్ మాస్ ముందు క్లాస్‌గా నిఖిల్ తట్టుకోగలడా.? అంటే, ఈ రెండూ డిఫరెంట్ జోనర్ మూవీస్.

ఈ మధ్య సూపర్ నేచురల్ పవర్ సినిమాలు పెద్దగా తెరకెక్కడం లేదు. అందులోనూ, ‘కార్తికేయ’‌తో ఆల్రెడీ హిట్టు కొట్టిన నిఖిల్, దానికి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి, తొలి పార్ట్‌కి కొనసాగింపుగా అనేక ఆసక్తికరమైన అంశాలు వుండబోతున్నాయని చెబుతున్నాడు. 
అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో, తొలి పార్ట్ హీరోయిన్ స్వాతి కూడా ఓ ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించబోతోందని నిఖిల్ క్లారిటీ అయితే ఇచ్చాడు కానీ, ఆ పాత్ర ఏంటనేది మాత్రం రివీల్ చేయలేదు. 

లొకేషన్లు, గ్రాఫిక్స్.. ఇలా అన్నీ‘కార్తికేయ 2’లో సరికొత్త అనుభూతినిస్తాయని, ఖచ్చితంగా ధియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు టిక్కెట్ వసూల్ ఫీల్ పొందుతారనీ అంటున్నాడు నిఖిల్. మరి, నిఖిల్ చెప్పినట్లుగా ‘రెండో కార్తికేయుడు’ అంచనాల్ని అందుకుంటాడా అనేది తెలియాలంటే, ఆగస్ట్ 12 వరకూ వేచి చూడాల్సిందే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com