మళ్లీ వాయిదా: ఒక్కరోజు ఆలస్యంగా ‘కార్తికేయ 2’.!

- August 03, 2022 , by Maagulf
మళ్లీ వాయిదా: ఒక్కరోజు ఆలస్యంగా ‘కార్తికేయ 2’.!

నిఖిల్ సిద్దార్డ్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’కు వాయిదాల పర్వం తప్పడం లేదు. ఎప్పుడో రావల్సిన సినిమా ఇది. మొన్న నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమా కోసం ఈ సినిమాని నిర్ధాక్షిణ్యంగా వాయిదా వేసేశారు.

అదే పోన్లే అనుకుని నిఖిల్ సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘కార్తికేయ 2’. కానీ, అదే రోజు నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
దాంతో మళ్లీ, నిఖిల్‌ని వెనక్కి నెట్టేశారు. ఒక్కరోజు ఆలస్యంగా అంటే, ఆగస్టు 13న ధియేటర్లో సందడి చేయనున్నాడు ‘కార్తికేయ 2’. ఒక్కరోజే కానీ, పోస్ట్‌పోన్ అనే ఇంపాక్ట్ మాత్రం దారుణంగా వుంటుంది. 
అందుకే నిఖిల్ మొదటి సారి పోస్ట్ పోన్ అయినప్పుడే చాలా బాధపడ్డాడు. లిటరల్‌గా ఏడ్చేశాడు. సర్లే అని సరిపెట్టుకుంటే, ఇప్పుడు ఇంకోసారి. ‘సినిమాలు క్లాష్ అవ్వడం మంచిది కాదు.. అనుకోవడం తప్పు లేదు కానీ, ప్రతిసారీ నన్నే ఎందుకు బాధపెడుతున్నారు..’ అంటూ తాజా వాయిదాపై నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అదీ నిజమే. ప్రతిసారీ నిఖిల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో. ఏధి ఏమైతేనేం, నిఖిల్ సక్సెస్ కొట్టి సమాధానం చెప్పాలి. పాపం నిఖిల్, ఈ సింపథీతోనైనా సరే, ‘కార్తికేయ 2’ హిట్ అవ్వాలని కోరుకుందాం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com