కళ్యాణ్ రామ్‌కి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.?

- August 03, 2022 , by Maagulf
కళ్యాణ్ రామ్‌కి ఆ సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా.?

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్‌లో నటించిన ‘అతనొక్కడే’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘పటాస్’ కూడా ఆయన కెరీర్‌లో బెస్ట్ మూవీగా చెప్పుకోవచ్చు. ఈ రెండు సినిమాలూ ఎన్టీయార్ ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మించిన సినిమాలే.
తాజాగా ఆయన నటించిన ‘బింబిసార’ చిత్రం కూడా సొంత బ్యానర్‌లో రూపొందిన సినిమానే కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు క్రియేట్ అవుతున్నాయ్. అందులోనూ, ఈ సినిమా బాధ్యతను ఎన్టీయార్ కూడా తన భుజాలపై వేసుకున్నారు.

దాంతో ఎన్టీయార్ ఫ్యాన్స్ ఈ సినిమాని ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్నారట. సినిమాని బాగా ప్రమోట్ చస్తున్నారట. దాంతో ఈ సినిమాతో మళ్లీ కళ్యాణ్ రామ్ తన రికార్డులు తానే బ్రేక్ చేసుకుంటాడని అనుకుంటున్నారు. 

ఫ్రాంచైజీ నేపథ్యంలో రూపొందిన ‘బింబిసార’ ఒకింత ఆసక్తికరంగానే అనిపిస్తోంది. ప్రమోషన్లు బాగా చేస్తున్నారు. ప్రచార చిత్రాలు ఇంట్రెస్టింగ్‌గా వున్నాయ్. రెండు కాలాల్లో నడిచే స్టోరీగా ఈ సినిమా రూపొందింది. కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ వేరియేషన్లలో కనిపించనున్నాడు. 
అతి క్రూరమైన రాజు బింబిసారుడి పాత్ర ఒకటి కాగా, మోడ్రన్ లుక్స్‌తో వుండే పాత్ర ఇంకోటి. ఈ సినిమా రిలీజ్ కోసం చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నానంటున్నాడు కళ్యాణ్ రామ్. సంయుక్తా మీనన్, కేథరీన్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వశిష్ట ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com