మళ్లీ వాయిదా: ఒక్కరోజు ఆలస్యంగా ‘కార్తికేయ 2’.!
- August 03, 2022
నిఖిల్ సిద్దార్డ్ హీరోగా నటించిన ‘కార్తికేయ 2’కు వాయిదాల పర్వం తప్పడం లేదు. ఎప్పుడో రావల్సిన సినిమా ఇది. మొన్న నాగచైతన్య ‘థాంక్యూ’ సినిమా కోసం ఈ సినిమాని నిర్ధాక్షిణ్యంగా వాయిదా వేసేశారు.
అదే పోన్లే అనుకుని నిఖిల్ సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా వాయిదా పడింది. ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘కార్తికేయ 2’. కానీ, అదే రోజు నితిన్ నటించిన ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా వుంది.
దాంతో మళ్లీ, నిఖిల్‌ని వెనక్కి నెట్టేశారు. ఒక్కరోజు ఆలస్యంగా అంటే, ఆగస్టు 13న ధియేటర్లో సందడి చేయనున్నాడు ‘కార్తికేయ 2’. ఒక్కరోజే కానీ, పోస్ట్‌పోన్ అనే ఇంపాక్ట్ మాత్రం దారుణంగా వుంటుంది.
అందుకే నిఖిల్ మొదటి సారి పోస్ట్ పోన్ అయినప్పుడే చాలా బాధపడ్డాడు. లిటరల్‌గా ఏడ్చేశాడు. సర్లే అని సరిపెట్టుకుంటే, ఇప్పుడు ఇంకోసారి. ‘సినిమాలు క్లాష్ అవ్వడం మంచిది కాదు.. అనుకోవడం తప్పు లేదు కానీ, ప్రతిసారీ నన్నే ఎందుకు బాధపెడుతున్నారు..’ అంటూ తాజా వాయిదాపై నిఖిల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
అదీ నిజమే. ప్రతిసారీ నిఖిల్‌నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో. ఏధి ఏమైతేనేం, నిఖిల్ సక్సెస్ కొట్టి సమాధానం చెప్పాలి. పాపం నిఖిల్, ఈ సింపథీతోనైనా సరే, ‘కార్తికేయ 2’ హిట్ అవ్వాలని కోరుకుందాం.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్‌లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







