తదుపరి సీజేఐగా జస్టిస్ యుయు లలిత్: కేంద్రానికి జస్టిస్ రమణ సిఫార్సు
- August 04, 2022
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తదుపరి చీఫ్ జస్టిస్‌గా యుయు లలిత్ పేరును చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్వీ రమణ నేడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రికమండేషన్ లెటర్‌ను కూడా జస్టిస్ లలిత్‌కు సీజేఐ రమణ అందజేశారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు నుంచి బుధవారం రాత్రి సీజేఐ సెక్రటేరియేట్‌కు ఫోన్ కాల్ వెళ్లింది. తదుపరి సీజేఐ పేరును ప్రతిపాదించాలని మంత్రి రిజుజు ఎన్వీ రమణను కోరారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం ఆగస్టు 26వ తేదీన ముగియనున్నది. ఆ తర్వాత జస్టిస్ లలిత్ బాధ్యతలు స్వీకరిస్తారు. అయితే చాలా తక్కువ కాలమే జస్టిస్ లలిత్ ఆ పదవిలో ఉండనున్నారు. ఆయన నవంబర్ 8వ తేదీన రిటైర్ అవుతారు. జస్టిస్ లలిత్ తర్వాత జస్టిస్ డీవై చంద్రచూడ్ సీజే అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే చంద్రచూడ్ మాత్రం రెండేళ్లు సీజేఐగా చేసే ఛాన్సు ఉంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







