విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం..
- August 04, 2022
అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహాయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పథకం కింద ప్రపంచంలో టాప్ 200లోపు క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో ఉన్న విదేశీ విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, ఎంబీబీఎస్ అభ్యసించాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ఈ వర్గాలకు చెందిన 35 ఏళ్లలోపువారు జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
డిగ్రీ, పీజీ, ఇంటర్మీడియెట్‌ల్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ కోర్సుకు నీట్‌లో అర్హత సాధించి ఉండాలి. ప్రపంచంలో టాప్ 100లోపు ర్యాంకు గల విశ్వవిద్యాలయాలు/విద్యా సంస్థల్లో ప్రవేశం పొందితే ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. 101 నుంచి 200లోపు ర్యాంకు కలిగినవాటిలో అడ్మిషన్ పొందితే రూ.50 లక్షలు, 50 శాతం ఫీజుల్లో ఏది తక్కువ అయితే అది ప్రభుత్వం భరిస్తుంది. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 30లోగా https://jnanabhumi. ap.gov.in/ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ కె.హర్షవర్దన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









