బాహుబలి నోట ‘సీతారామం’ మాట: గొప్పగా.!
- August 04, 2022
‘సీతారామం’.. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా రూపొందిన చిత్రమిది. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా, ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్ర యూనిట్.
అయితే, చాలా తక్కువ మంది సమక్షంలో అది కూడా కేవలం మీడియా మిత్రుల సమక్షంలోనే ఈ ఈవెంట్ చేయడం విశేషం. అందుకు కారణం లేకపోలేదు. ‘బింబిసార’ ఈవెంట్‌లో జరిగిన విషాదం కారణంగా ‘సీతారామం’ యూనిట్ ఈ నిర్ణయం తీసుకుందట.
కాగా, ఈ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రబాస్, సినిమా గురించి పలు ఆసక్తికరమైన అంశాలు పంచుకున్నాడు. రష్యాలో షూటింగ్ చేసిన ఏకైక తెలుగు సినిమా ఇదేనేమో అని ప్రబాస్ తెలిపారు. సినిమా అవుట్ పుట్ చాలా బాగా వచ్చిందట. కాశ్మీర్‌లో ఎక్కువ భాగం షూటింగ్ జరిపారట.
ఆ సీన్లు చూసేందుకు సగటు ప్రేక్షకుడిగా తాను కూడా చాలా ఈగర్‌గా ఎదురు చూస్తున్నానని ప్రబాస్ చెప్పాడు. అలాగే ‘సీతారామం’ మంచి విజయం అందుకోవాలని ఆకాంక్షించాడు ప్రబాస్.
మరోవైపు వైజయంతీ మూవీస్ బ్యానర్‌లో ప్రస్తుతం ప్రబాస్ ‘ప్రాజెక్ట్ కె’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగ అశ్విన్ ఈ సినిమాకి దర్శకుడు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







