ప్రేమ విషయంలో చైతూ ఇలా.. సామ్ అలా.!
- August 06, 2022
చై, సామ్ విడాకులకు సంబంధించి ఎన్ని వార్తలు వచ్చినా, అది మీడియాకి మంచి స్టఫ్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఆ స్టఫ్ పట్ల కూసింత ఆసక్తి ఎక్కువగానే చూపిస్తుంటారు.
చైతూ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వున్నారు. ఈ ప్రమోషన్లకు సంబంధించి పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు చైతూ. సినిమాకి సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుంటూనే, మధ్య మధ్యలో సామ్‌తో విడాకుల ఇష్యూకి సంబంధించి కూడా ఏదో ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. పాపం.! అస్సలు విసిగిపోకుండా చైతూ సమాధానమిస్తూనే వున్నాడు.
కానీ, ఈ విడాకుల ఘట్టం పూర్తయ్యాకా, నా నుంచి మూడు సినిమాలు రిలీజయ్యాయ్. కానీ, విడాకుల గోల మాత్రం తప్పడమే లేదు. ఈ పనికి రాని వార్తలతో నేను చాలా విసిగిపోతున్నా.. అంటున్నాడు చైతూ.
అయితే, అది ముగిసిపోయిన ఘట్టం అనుకోండి. భవిష్యత్‌లో ప్రేమలో పడే అవకాశముందా.? అని చైతూని అడిగితే, తప్పకుండా పడతాను. మనిషి బతకడానికి ఊపిరి ఎంత అవసరమో, అలాగే, ప్రేమ కూడా అంతే అవసరం. సంతోషంగా బతకడానికి, పాజిటివ్‌గా వుండడానికి ప్రేమ ఎంతో అవసరం..’ అని చైతూ సమాధానమిచ్చాడు.
ప్రేమ విషయంలో చైతూ అభిప్రాయం ఇలా వుంటే, సామ్ మాత్రం భవిష్యత్తులో తాను మళ్లీ ప్రేమలో పడే సాహసం చేయనని స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్‌లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







