త్వరతగతిన పూర్తి అవుతున్న ఫుజైరా రైల్వే లైన్
- August 06, 2022
యూఏఈ: ఇతిహాద్ రైలు యొక్క ఫుజైరా రైల్వే లైన్ నిర్మాణం పనులు త్వరతగతిన పూర్తి అవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి.
అబుధాబి, దుబాయ్ లను కలుపుతూ వేస్తున్న రైల్వే మార్గంలో ఈ రైల్వే లైన్ హజర్ పర్వతాలను కట్ చేస్తూ రాస్ అల్ ఖైమా కోస్తా తీరం దాకా విస్తరించడం జరిగింది.
ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇతిహాద్ రైలు అధికారులు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. షార్జా సరిహద్దు నుండి రాస్ అల్ ఖైమా కోస్తా తీరం వరకు సుమారు 145 కిలో మీటర్లు ఈ లైన్ నిర్మాణం విస్తరించి ఉంది.
రైలు ప్రయాణం చాలా సురక్షితమైనది మరియు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని కూడా పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 11 నగరాలను రైల్వే ద్వారా అనుసంధానించడం జరుగుతుంది.
2030 నాటికి దేశవ్యాప్తంగా రైళ్ళ లో ప్రయాణించే వారి సంఖ్య 36.5 మిలియన్లు ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..
- ఇరాన్ చమురు వాణిజ్యంపై భారత్‌తో సంబంధం ఉన్నకంపెనీల పై ట్రంప్ ఆంక్షలు
- కువైట్‌లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్‌లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!







