తెలుగు హీరోలు ఫెయిల్: మలయాళ హీరో కొట్టాడు గట్టిగా.!
- August 08, 2022
‘అందాల రాక్షసి’ సినిమాతో ఇండస్ట్రీని కొత్తగా ఆకర్షించిన దర్శకుడు హను రాఘవపూడి. ఆ తర్వాత నేచురల్ స్టార్ నాని హీరోగా ‘కృష్ణార్జున యుద్దం’ సినిమా తెరకెక్కించాడు. చిన్న సినిమాల్లో పెద్ద హిట్‌గా నిలిచింది ఈ సినిమా.
ఆ తర్వాత నితిన్‌తో ‘లై’, శర్వానంద్‌తో ‘పడి పడి లేచె మనసు’ సినిమాలతో ఢీలా పడ్డాడీ దర్శకుడు. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ ‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సారి అలా ఇలా కాదు, సూపర్ హిట్ కొట్టాడు. కూల్ అండ్ లవ్‌లీ మూవీగా ‘సీతారామం’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఈ సినిమా కోసం హను రాఘవపూడి ఈ సారి తెలుగు హీరోలను నమ్ముకోలేదు. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్‌ని తీసుకున్నాడు.
అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమాకీ, హను రాఘవపూడి డైరెక్షన్‌కీ దుల్కర్ సల్మాన్ మెయిన్ అస్సెట్ అయ్యాడు. అన్నీ కుదిరాయ్. ‘సీతారామం’ మంచి విజయం అందుకుంది. దాంతో మళ్లీ హను రాఘవపూడి ఫామ్‌లోకి వచ్చేశాడు.
ఈ సినిమా సక్సెస్‌తో తెలుగు హీరోలు హనుతో సినిమా చేయడానికి క్యూ కట్టేశారట. ఆల్రెడీ రెడీ చేసుకున్న కథల్లో కొన్నింటిని ఆయా హీరోలకు నెరేట్ చేసే పనిలో హను రాఘవపూడి బిజీ అయిపోయాడట.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







