లవ్‌లో ఫెయిలై యువతి ఆత్మహత్యాయత్నం..జరిమానా వేసిన దుబాయ్ కోర్టు

- August 10, 2022 , by Maagulf
లవ్‌లో ఫెయిలై యువతి ఆత్మహత్యాయత్నం..జరిమానా వేసిన దుబాయ్ కోర్టు

దుబాయ్: దుబాయ్‌లో ఉంటున్న ఆసియాకు చెందిన 30 ఏళ్ల యువతి తనతో పాటు కలిసి పనిచేసే ఓ వ్యక్తిని ప్రేమించింది.అలా కొన్నిరోజులు వారిద్దరూ కలిసి బాగానే తిరిగారు.ఈ క్రమంలో ఆ వ్యక్తి మరో మహిళతో కలిసి తిరగడం ఆమె చూసింది.తాను ప్రేమించినవాడు మరో మహిళతో కలిసి తిరగడం చూసి మోసపోయానని ఆవేదనకు లోనైంది.ఇలా లవ్‌లో ఫెయిల్ కావడంతో చనిపోవాలనుకుంది.వెంటనే తాను నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందకు దూకేసింది.తీవ్రంగా గాయపడిన ఆమెను ఇరుగుపొరుగు వాళ్లు హూటాహూటిన ఆస్పత్రికి తరలించారు.దాంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.గత నెలలో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా యువతిని దుబాయ్ కోర్టులో హాజరుపరిచారు.దీంతో అక్కడి చట్టాల ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరమని యువతికి కోర్టు 1000 దిర్హమ్స్ జరిమానా విధించింది.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com