యూఏఈ-ఇండియా మధ్య నూతన డైరెక్ట్ ఫ్లయిట్ ప్రకటించిన ఇండిగో

- August 10, 2022 , by Maagulf
యూఏఈ-ఇండియా మధ్య నూతన డైరెక్ట్ ఫ్లయిట్ ప్రకటించిన ఇండిగో

రాస్ అల్ ఖైమా: ముంబై-రాస్ అల్ ఖైమా మధ్య డైరెక్ట్ ఫ్లయిట్ ను ప్రముఖ భారత విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.ఆ సంస్థకు ఈ రూట్ 100 వ డెస్టినేషన్ కాబోతుంది. 

ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు ఈ నూతన డైరెక్ట్ విమాన రాకపోకలు దోహదపడతాయి . అంతేకాకుండా మాకు సంస్థకు రాస్ అల్ ఖైమా రూట్ 26వ అంతర్జాతీయ విమాన రూట్ కాగా మొత్తంగా 100 వ విమాన రూట్ చాలా సంతోషకరం అని ఇండిగో రెవెన్యూ అధికారి సంజయ్ కుమార్ తెలిపారు.  


రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం ఇండిగో విమానయాన సంస్థ తో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరం. భారత ఉపఖండం లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ నూతన డైరెక్ట్ విమానం చాలా బాగా ఉపయోగపడుతుందని రాస్ అల్ ఖైమా పౌర విమానయాన విభాగం ఛైర్మన్ షేక్ సలేం బిన్ సుల్తాన్ అల్ కష్మి తెలిపారు. 

భారత ఉపఖండం లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇండిగో తో జరిగిన నూతన ఒప్పంద భాగస్వామ్యం చాలా దోహదపడుతుంది అని రాస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయం సీయివో అటనో సియోస్ టిత్నాయిస్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com