బిగ్‌బాస్ హౌస్‌లో అలనాటి బుల్లితెర డైనమైట్.!
- August 10, 2022
ఉదయభాను.. ఈ పేరు బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత సుపరిచితం. ఒకప్పుడు బుల్లితెరను ఏక ఛత్రాధిపత్యంగా ఏలిన రాణి ఉదయ భాను.పెద్ద తెరపైనా ఓ మోస్తరు హీరోయిన్గా తనదైన ముద్ర వేసుకుంది అందాల భామ ఉదయ భాను.
ఆ తర్వాత ప్రేమ, పెళ్లి.. లాంటి వివాదాలతోనూ ఉదయ భాను కొన్నాళ్లు సావాసం చేసింది. ఎట్టకేలకు పెళ్లి చేసుకుని, ఇద్దరు కవల ఆడపిల్లలకు జన్మనిచ్చి లైప్‌లో సెటిలైపోయింది.
ఈ మధ్యనే మళ్లీ బుల్లితెరపై ఒకటీ అరా షోలతో మళ్లీ ముఖానికి రంగు వేసుకుంది. అయితే, మునుపటి క్రేజ్ ఇప్పుడు ఉదయ భాను దక్కించుకోలేకపోతోంది. అందుకే ఆ క్రేజ్ మళ్లీ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంది ఉదయ భాను.
బుల్లితెరపై క్రేజీ గేమ్ షో అయిన బిగ్‌బాస్ షోలో ఉదయ భాను సందడి చేయబోతోందనే ప్రచారం గత కొన్నేళ్లుగా నడుస్తోంది. కానీ, అది జరగలేదింతవరకూ. ఈ సారి ఆ ప్రచారం నిజమయ్యేలా వుంది. ఆరో సీజన్ బిగ్‌బాస్‌కి ఉదయ భాను మెయిన్ అట్రాక్షన్ కానుందంటూ సరికొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
గతంలోనూ ఆఫర్ వచ్చినా సింపుల్‌గా నో చెప్పిన ఉదయ భాను ఈ సారి ఓకే చెప్పిందని సమాచారం. బహుశా హేమ, కళ్యాణి, ప్రియ తదితర సీనియర్ నటీమణుల ప్లేస్‌ని ఉదయ భానుతో రీప్లేస్ చేయబోతున్నారేమో బిగ్‌బాస్ నిర్వహకులు చూడాలి మరి.
తాజా వార్తలు
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్







