సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్న యూఏఈ కొత్త వీసాలు..
- August 11, 2022
యూఏఈ: యూఏఈ ఇటీవల ప్రవాసుల కోసం కొన్ని కొత్త వీసాలను ప్రకటించిన విషయం తెలిసిందే.వీటిలో కొన్ని ఇప్పటికే అమలులో ఉన్నాయి.అయితే, అమలులో ఉన్న ఈ వీసాలకు కొన్ని మార్పులు చేసింది.ఇలా కొత్తగా వస్తున్న ఈ వీసాలు సెప్టెంబర్ నుంచి వాడుకలోకి తీసుకువస్తున్నట్లు యూఏఈ తాజాగా వెల్లడించింది.ఇప్పటికే ప్రవాసులకు దీర్ఘకాలికి రెసిడెన్సీ కోసం అమలు చేస్తున్న గోల్డెన్ వీసా పథకాన్ని అక్కడి ప్రభుత్వం విస్తరించింది.అలాగే గ్రీన్ రెసిడెన్సీ పేరిట ఐదేళ్ల కాలానికి కొత్త వీసా తీసుకొచ్చింది.దీంతో పాటు మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసా, ఉద్యోగార్థుల కోసం ఉద్యోగ అన్వేషణ ఎంట్రీ పర్మిట్ వంటి పలు రకాల వీసాలు ప్రకటించింది. ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి అమలులోకి రానున్నాయి.ఈ మేరకు ఏప్రిల్‌లో యూఏఈ కేబినేట్ ప్రకటించింది. వీటిలో కొన్ని ఇప్పటికే ప్రవేశపెట్టబడ్డాయి.సెప్టెంబర్ నుంచి అమలులోకి రానున్న యూఏఈ ప్రకటించిన కొత్త వీసాల వివరాలు...
మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా: ఐదేళ్ల కాలపరిమితో ఇచ్చే ఈ మల్టీ-ఎంట్రీ టూరిస్ట్ వీసా కు స్పాన్సర్ అవసరం లేదు. అలాగే 90 రోజుల వరకు యూఏఈలో ఉండేందుకు వీలు కల్పిస్తుంది. మరో 90 రోజుల పాటు పొడిగించుకునే వెసులుబాటు కూడా ఉంది.ఇలా ఓ వ్యక్తి ఈ వీసాతో ఆ దేశంలో 180 రోజులు ఉండొచ్చు.అయితే, దరఖాస్తుదారుడు దరఖాస్తు చేయడానికి ముందు గత ఆరు నెలల్లో తప్పనిసరిగా 14,700 దిర్హాములు లేదా విదేశీ కరెన్సీలలో దానికి సమానమైన బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండాలి.
బిజినెస్ వీసా: పెట్టుబడిదారులు, వ్యవస్థాపకులు స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేకుండానే బిజినెస్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
బంధువులు/స్నేహితులను సందర్శించడానికి వీసా: ఒక విదేశీయుడు యూఏఈలో పౌరుడు/నివాసి స్నేహితుడు లేదా బంధువు అయితే ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేదు.
చదువు/శిక్షణ కోసం వీసా: ఈ వీసా శిక్షణ, పరిశోధన కోర్సులు,ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లకు హాజరు కావాలనుకునే వ్యక్తులు లేదా విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది.ఈ వీసాను ప్రభుత్వ, ప్రైవేట్ రంగ విద్యా మరియు పరిశోధనా సంస్థలు స్పాన్సర్ చేసే వెసులుబాటు ఉంది.దీనికి అధ్యయనం లేదా శిక్షణ లేదా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, దాని వ్యవధి వివరాలను స్పష్టం చేస్తూ సంబంధిత సంస్థ నుండి తీసుకున్న లేఖ సమర్పించాల్సి ఉంటుంది.
టెంపరరీ వర్క్ వీసా: ప్రొబేషన్ టెస్టింగ్, ప్రాజెక్ట్ ఆధారిత పని వంటి తాత్కాలిక వర్క్ అసైన్‌మెంట్ ఉన్నవారు ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.దీనికోసం అభ్యర్థులు తాత్కాలిక పని ఒప్పంద పత్రాన్ని లేదా యజమాని నుండి ఒక లేఖ, ఫిట్‌నెస్ ధృవపత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
జాబ్ వీసా: యూఏఈలో ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి ఉద్యోగార్ధులు ఈ కొత్త జాబ్ వీసా ను పొందవచ్చు.ఈ వీసాకు స్పాన్సర్ గానీ, హోస్ట్ గానీ అవసరం.ఇది బ్యాచిలర్ డిగ్రీ హోల్డర్‌లకు, ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాలకు చెందిన గ్రాడ్యుయేట్‌లతో పాటు మానవ వనరులు, ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ విభజించిన మొదటి, రెండవ, మూడవ నైపుణ్య కేటగిరీల కిందకు వచ్చే వారికి మంజూరు చేయబడుతుంది.
ఫ్యామిలీ వీసా: గతంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు 18 ఏళ్లలోపు మాత్రమే స్పాన్సర్ చేసే వీలు ఉండేది.తాజాగా తీసుకువస్తున్న ఈ ఫ్యామిలీ వీసా ద్వారా ఇప్పుడు మగ పిల్లలను 25 సంవత్సరాల వయస్సు వరకు స్పాన్సర్ చేయవచ్చు. వికలాంగ పిల్లలు కూడా ప్రత్యేక అనుమతిని పొందుతారు. అవివాహిత కుమార్తెలకు తల్లిదండ్రులు నిరవధిక సమయం వరకు స్పాన్సర్ చేయవచ్చు.
గ్రీన్ వీసా: ఐదేళ్ల వ్యవధితో వచ్చే గ్రీన్ వీసా ద్వారా వీసాదారులు తమ కుటుంబ సభ్యులను స్పాన్సర్ లేదా యజమాని లేకుండా తీసుకురావడానికి అనుమతిస్తుంది. ఈ వీసా నైపుణ్యం కలిగిన కార్మికులు, స్వీయ-యజమానులు, ఫ్రీలాన్సర్లు మొదలైన వారికి వర్తిస్తుంది.
గోల్డెన్ వీసాలు: యూఏఈ అనేక రకాల ప్రొఫెషనల్ కేటగిరీలు మరియు దీర్ఘకాల ప్రాతిపదికన దేశంలోని అత్యుత్తమ జీవన నాణ్యతను ఆస్వాదించే పెట్టుబడిదారుల కోసం ఈ గోల్డెన్ వీసాలను ప్రకటించింది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







