మొన్న తాప్సీ, ఇప్పుడు శృతిహాసన్: ఏంటీ ‘డామినేటింగ్’ లొల్లి.!
- August 11, 2022
టాలీవుడ్‌లో హీరోల డామినేషన్ ఎక్కువ.. అదేనండీ, పురుషుల డామినేషన్ ఎక్కువ.. అంటూ వీలు చిక్కినప్పుడల్లా తాప్సీ పన్ను నోరు పారేసుకుంటూనే వుంటుంది. తన కెరీర్ మొదట్లో ఈ పురుషాధిక్యత వల్లనే చాలా సమస్యలు ఎదుర్కొన్నాననీ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేసింది గతంలో.
ఇప్పుడు ఈ తరహా వ్యాఖ్యలనే ముద్దుగుమ్మ శృతిహాసన్ కూడా చేస్తోంది. అవును నిజమే, ఇండస్ర్టీలో మేల్ డామినేషన్ ఎక్కువే అంటోంది శృతిహాసన్. అయితే, ఏ ఇండస్ట్రీ అని మాత్రం ప్రత్యేకంగా ఎత్తి చూపలేదు శృతి హాసన్.
అంతేకాదు, నెపోటిజం పైనా శృతిహాసన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. స్టార్ కిడ్స్‌కి అవకాశాలు ఈజీగా వచ్చేస్తాయ్ అని అంటుంటారు. కానీ, ఇండస్ట్రీలో అంతా ఒకటే.. అదృష్టంతోనే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం.. నిలదొక్కుకోలేకపోవడం అనేది జరుగుతుంది.. అని శృతిహాసన్ సెలవిచ్చింది.
అంతేకాదు, కమల్ తనయగా మాత్రమే తాను ఇండస్ర్టీకి పరిచయమయ్యాననీ, హీరోయిన్‌గా స్టార్‌డమ్ దక్కించుకోవడానికి మాత్రం తన టాలెంట్, కష్టమే కారణమనీ శృతిహాసన్ పేర్కొంది.
శృతిహాసన్ ప్రస్తుతం ప్రబాస్‌తో ‘సలార్’ సినిమాతో పాటూ, మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా, బాలయ్య బాబుతో ఇంకో సినిమాలోనూ నటిస్తోంది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







