‘సలార్’ కూడా ‘కేజీఎఫ్’ లానే: ఒకటి కాదు రెండు.!
- August 11, 2022
‘కేజీఎఫ్’ సినిమాతో కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్యాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు. దాంతో, ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయాలని తెలుగు స్టార్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు.
అందులో భాగంగానే ఆల్రెడీ ప్రశాంత్ నీల్ని కొందరు తెలుగు హీరోలు హోల్డ్ చేసి పెట్టేశారు. అందులో ప్రబాస్‌తో ‘సలార్’ సినిమా పట్టాలపై వున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీయార్‌తో ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేయాల్సి వుంది.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘సలార్’ సినిమాని కూడా ‘కేజీఎఫ్’ మాదిరి రెండు పార్టులుగా విడుదల చేయాలని ప్రశాంత్ నీల్ అండ్ టీమ్ యోచిస్తోందట. అయితే, రెండు పార్టులకు సంబంధించిన షూటింగ్ పార్ట్ మొత్తం ఒకేసారి పూర్తి చేయాలనుకుంటోందట.
ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, రెండు పార్టులనూ వెంట వెంటనే రిలీజ్ చేయాలనుకుంటున్నాడట ప్రశాంత్ నీల్. అందుకోసం గ్రౌండ్ వర్క్ మొత్తం ప్రిపేర్ చేస్తున్నాడట.
ప్రస్తుతం ప్రబాస్ సర్జరీ కారణంగా షూటింగ్ నుంచి రెస్ట్ తీసుకుంటున్నాడు. కానీ, త్వరలోనే షూటింగ్లో పాల్గొని, కంటిన్యూస్‌గా షెడ్యూల్స్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడట. ‘బాహుబలి’, ‘కేజీఎప్’ తరహాలోనే రెండు పార్టులుగా ప్రబాస్ ‘సలార్’ రిలీజ్ కానుందన్న మాట.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







