‘కార్తికేయ’లో కలర్స్ స్వాతి పాత్ర అందుకే తీసేశారట.!

- August 11, 2022 , by Maagulf
‘కార్తికేయ’లో కలర్స్ స్వాతి పాత్ర అందుకే తీసేశారట.!

నిఖిల్ సిద్దార్ధ్, కలర్స్ స్వాతి నటించిన ‘కార్తికేయ’ చిత్రం సూపర్ హిట్‌గా నిలిచింది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కీలకంగా ఫాంటసీ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా భారీ విజయం అందుకోవడంతోనే దీనికి సీక్వెల్ రూపొందించాలని అప్పుడే డిసైడ్ అయిపోయాడు డైరెక్టర్ చందూ మొండేటి.
ఆ ఆలోచనకు రూపమొచ్చింది. ‘కార్తికేయ 2’ రూపు దిద్దుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధమైంది. ఈ శనివారం ‘కార్తకేయ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా వుంది.
కాగా, సీక్వెల్ అంటే, కథతో పాటూ, కొన్ని క్యారెక్టర్లు క్యారీ అవుతుంటాయ్. కానీ, ‘కార్తికేయ 2’ పూర్తి భిన్నంగా రూపొందిన కథగా డైరెక్టర్ చందూ మొండేటి చెబుతున్నాడు. అందుకే, మొదటి పార్ట్‌లో కనిపించిన నటీనటులు పెద్దగా ఈ పార్ట్‌లో కనిపించరట. ముఖ్యంగా హీరోయిన్ స్వాతి పాత్రను ఈ పార్ట్‌లో అందుకే తీసేశామనీ ఆయన కన్‌ఫామ్ చేశారు. 
హీరో మొదటి పార్ట్‌లో మెడికల్ స్టూడెంట్ కాగా, ఈ పార్ట్‌లో డాక్టర్‌గా కనిపించబోతున్నాడు. అయితే, కృష్ణుడి బ్యాక్‌డ్రాప్ స్టోరీకీ, ఓ డాక్టర్‌కీ ఏంటి సంబంధం.? అనేది తెలియాలంటే ‘కార్తికేయ 2’ సినిమా చూడాల్సిందే. 
ముఖ్యంగా 15 ఏళ్ల లోపు పిల్లలు ఈ సినిమాని ఎక్కువగా చూడాలనీ చందూ మొండేటి కోరుకుంటున్నారట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com