పవన్ సినిమాని రీమేక్ చేస్తానంటోన్న ‘విక్రమ్’ డైరెక్టర్.!
- August 11, 2022
‘విక్రమ్’ సినిమాతో ఈ మధ్య లోకేష్ కనగరాజ్ పేరు తెగ మార్మోగిపోయిన సంగతి తెలిసిందే. అంతకు ముందే, డైరెక్టర్‌గా ఆయన పనితనం గురించి తెలిసినా, ‘విక్రమ్’ లోకేష్ పనితనాన్ని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లింది.
‘విక్రమ్’ తర్వాత లోకేష్ కనగరాజ్, దళపతి విజయ్‌తో ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ లోపు ఆయన మరో కొత్త ప్రాజెక్ట్‌ని తాజాగా రివీల్ చేశారు.
మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుం కోషియమ్’ సినిమాని తమిళంలో రీమేక్ చేయబోతున్నారట. తెలుగులో ఈ సినిమాని పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్‌లో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ బాక్సాఫీస్‌ని సైతం ఈ సినిమా షేక్ చేసింది.
ఇప్పుడు కోలీవుడ్‌కి కాసుల పంట పండించేలా లోకేష్ కనగరాజ్ ఓ ఇంట్రెస్టింగ్ కాంబోని సెట్ చేశాడు ఈ రీమేక్ కోసం. ఇంతకీ ఆ కాంబినేషన్ ఏంటో తెలుసా.? సూర్య, కార్తి. ఆఫ్ స్ర్కీన్ అన్నదమ్ములైన ఈ ఇద్దరినీ, ఆన్ స్ర్కీన్ ఎనిమీస్‌గా మార్చేయబోతున్నాడట లోకేష్ కనగరాజ్.
ఇప్పుడీ అనౌన్స్‌మెంట్ తమిళ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు లోకేష్ ఖాతాలో విజయ్‌తో ఓ సినిమా, కార్తితో ‘ఖైదీ 2’ సినిమాలు పూర్తి చేయాల్సి వుంది. మరి, వీటి తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కిస్తాడా.? లేదంటే, అంతకు ముందే ఈ రీమేక్ సినిమాని కానిచ్చేస్తాడా.? అనేది తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







