హెలికాప్టర్‌ను నడిపిన యూఏఈ అధ్యక్షుడు
- August 12, 2022
యూఏఈ: ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హెలికాఫ్టర్ నడిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరిసారిగా 2017లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ విమానాన్ని నడిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఈ వైరల్ వీడియోలో షేక్ మహ్మద్ పర్వత ప్రాంతంలో హెలికాప్టర్‌ను నడుపుతున్నట్లు ఉన్నది. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ 18 సంవత్సరాల వయస్సు వరకు అల్ ఐన్, అబుదాబిలోని పాఠశాలల్లో చదువుకున్నాడు. 1979లో అతను ప్రతిష్టాత్మకమైన రాయల్ మిలిటరీ అకాడమీ శాండ్‌హర్స్ట్‌లో చేరాడు. అక్కడే హెలికాప్టర్ ఫ్లయింగ్, టాక్టికల్ ఫ్లయింగ్, పారాట్రూప్‌లలో శిక్షణ పొందాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత షార్జాలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ కోర్స్‌లో చేరడానికి UAEకి తిరిగి వచ్చాడు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







