టూరిస్ట్ వీసా హోల్డర్లు ఉమ్రా చేయవచ్చు
- August 12, 2022
జెడ్డా: పర్యాటక వీసాలు కలిగి ఉన్న సందర్శకులను ఉమ్రా చేయడానికి అనుమతిస్తున్నట్లు హజ్, ఉమ్రా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 49 దేశాల పౌరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని వెల్లడించింది. వీలైనంత ఎక్కువ మంది ఉమ్రా చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఉమ్రాకు అనుమతించిన 49 దేశాల జాబితాల్లో అమెరికా, ఇంగ్లండ్, స్కెంజెన్ దేశాలు కూడా ఉన్నాయి. కాగా, ఫ్యామిలీ విజిట్ వీసాలు ఉన్న వారు ఈట్‌మార్నా యాప్ ద్వారా బుకింగ్ చేయడం ద్వారా ఉమ్రా చేయవచ్చని సూచించింది. అయితే, ఉమ్రా చేయడానికి సందర్శకులు సమగ్ర ఆరోగ్య బీమాను పొందవలసి ఉంటుందని తెలిపింది. ఈ బీమాలో COVID-19 చికిత్సకు అయ్యే ఖర్చులు, మరణాలు లేదా వైకల్యానికి దారితీసే ప్రమాదాలతోపాటు విమానాల ఆలస్యం లేదా రద్దు కారణంగా ఉత్పన్నమయ్యే ఖర్చులు ఉంటాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







