'హర్ ఘర్ తిరంగా' కోసం 20 కోట్ల జాతీయ జెండాలు సిద్ధం
- August 13, 2022
న్యూఢిల్లీ: దేశమంతా 75వ స్వాతంత్ర వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో ఒక్క రోజు మాత్రమే జరిగే వేడుకలు ఈ సారి రెండు, మూడు వారాలపాటు సాగనున్నాయి.
దేశవ్యాప్తంగా ఈ నెల 2నుంచి సంబరాలు మొదలయ్యాయి. మరోవైపు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం కూడా విజయవంతంగా సాగుతోంది.
దీనిలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది. అందులోనూ ఈ నెల 13, 14, 15 తేదీల్లో వరుసగా మూడు రోజులు జాతీయ జెండా ఎగురుతుంది. దీంతో దేశవ్యాప్తంగా గతంలో ఎప్పుడూ లేనంతగా జాతీయ జెండాలకు డిమాండ్ పెరిగింది. కేంద్ర సాంస్కృతిక శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 20 కోట్లకు పైగా జాతీయ జెండాలు సిద్ధమయ్యాయి. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం గురించి ప్రధాని ప్రకటించిన తర్వాతి నుంచి ఈ జెండాలు సిద్ధమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం జెండా కోడ్‌లో మార్పులు తెస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది. దీంతో ప్రతి ఒక్కరూ జెండాను తమ ఇంటిపై ఎగరేసేందుకు ఆసక్తి చూపుతున్నారని అధికారులు అంటున్నారు.
దీని ప్రకారం పగటిపూటే కాకుండా, రాత్రిపూట కూడా జాతీయ జెండాలు ఇంటిపై ఎగరేయొచ్చు. కేంద్ర ప్రచారంలో భాగంగా జెండా ఎగరవేసిన తర్వాత సెల్ఫీ తీసుకుని, సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించింది. అలాగే సోషల్ మీడియా అకౌంట్లలో డీపీగా జాతీయ పతాకాన్ని ఉంచుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







