సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు..
- August 14, 2022
అమెరికా: దాడిలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సల్మాన్ రష్దీకి వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. కొద్దిగా మాట్లాడగలుగుతున్నారని ఆయన ప్రతినిధి ఆండ్రూ వైలీ వెల్లడించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. శుక్రవారం సల్మాన్ రష్దీపై హదీ మటార్ అనే వ్యక్తి న్యూయార్క్ నగరంలో దాడి చేసిన సంగతి తెలిసిందే.దాడిలో రష్దీ తీవ్రంగా గాయపడ్డారు.
దాడి అనంతరం ఆయన్ను హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన కాలేయానికి గాయాలయ్యాయి. అలాగే మోచేతి వద్ద నరాలు తెగిపోయాయి. వైద్యుల అంచనా ప్రకారం ఆయన ఒక కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. కాగా, దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితుడు చౌటాక్వా కౌంటీ జైలులో ఉన్నాడు. సల్మాన్ రాసిన ‘ద శాటానిక్ వర్సెస్’ నవలే ఆయనపై దాడికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ నవల ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండటంతో దీన్ని అనేక దేశాలు నిషేధించాయి. అలాగే ఇరాన్ అప్పట్లోనే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







