సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు..

- August 14, 2022 , by Maagulf
సల్మాన్ రష్దీకి వెంటిలేటర్ తొలగింపు..

అమెరికా: దాడిలో గాయపడి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సల్మాన్ రష్దీకి వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. కొద్దిగా మాట్లాడగలుగుతున్నారని ఆయన ప్రతినిధి ఆండ్రూ వైలీ వెల్లడించారు. అయినప్పటికీ ఆయన పరిస్థితి కాస్త విషమంగానే ఉన్నట్లు సమాచారం. శుక్రవారం సల్మాన్ రష్దీపై హదీ మటార్ అనే వ్యక్తి న్యూయార్క్ నగరంలో దాడి చేసిన సంగతి తెలిసిందే.దాడిలో రష్దీ తీవ్రంగా గాయపడ్డారు.

దాడి అనంతరం ఆయన్ను హెలికాప్టర్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారు. ఆయన కాలేయానికి గాయాలయ్యాయి. అలాగే మోచేతి వద్ద నరాలు తెగిపోయాయి. వైద్యుల అంచనా ప్రకారం ఆయన ఒక కంటి చూపు కోల్పోయే అవకాశం ఉంది. కాగా, దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం నిందితుడు చౌటాక్వా కౌంటీ జైలులో ఉన్నాడు. సల్మాన్ రాసిన ‘ద శాటానిక్ వర్సెస్’ నవలే ఆయనపై దాడికి ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ నవల ఇస్లాంకు వ్యతిరేకంగా ఉండటంతో దీన్ని అనేక దేశాలు నిషేధించాయి. అలాగే ఇరాన్ అప్పట్లోనే దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com