కాంగ్రెస్‌కు మరో షాక్..
- August 17, 2022
న్యూ ఢిల్లీ: జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ పదవికి సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ రాజీనామా చేసిన కొద్ది సమయానికే మరో ముగ్గురు కశ్మీర్ నేతలు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీకి రాజీనామా చేశారు. ఇందులో ఒకరు సోపోర్ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన హజి అబ్దుల్ రషిద్ కాగా మరో ఇద్దరు మహ్మద్ భట్, గుల్జర్ అహ్మద్ వని. ఇంత తక్కువ వ్యవధిలో నలుగురు కీలక నేతలు పార్టీ వీడడంతో ఇప్పటికే కశ్మీర్లో అంతంతగానే ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద ఎదురు దెబ్బని అంటున్నారు.
జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీని బుధవారమే ప్రకటించారు. ఇందులో పలువురికి చోటు ఇవ్వగా గులాం నబీ ఆజాద్‌ను ఆ కమిటీకి చెర్మన్‌గా నియమించారు. అయితే ఈ నిమాయకం జరిగిన గంటల వ్యవధిలోనే ఆయన రాజీనామా చేయడం విశేషం. అలాగే జమ్మూ కశ్మీర్‌లోని రాజకీయ వ్యవహాలర కమిటీ సభ్యుడిగా కూడా ఉన్న ఈయన.. ఆ పదవికి కూడా రాజీనామా చేశారు.
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతల్లో ఒకరైన ఆజాద్.. చాలా కాలంగా కాంగ్రెస్ అదిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.రాజ్యసభ పదవీ కాలాన్ని పొడగించకపోవడంతో పాటు బీజేపీ హిందుత్వ రాజకీయాల మూలంగా తనను పార్టీలో సైతం పక్కన పెట్టారనే అసంతృప్తి ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది. కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాలకు చాలా దూరంగా ఉంటూ తన అసంతృప్తిని తెలియజేస్తూనే వస్తున్నారు. ఈ తరుణంలో చాలా కాలం తర్వాత పార్టీ ఆయనకు పదవులు అప్పగించినప్పటికీ తన ఈసారి తన అసంతృప్తిని రాజీనామా ద్వారా తెలియజేయడం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







