‘కార్తికేయ 2’ హిట్టు: నిఖిల్ 50 కోట్ల క్లబ్బులో చేరతాడా..!
- August 17, 2022
నిఖిల్ సిద్దార్ధ్, అనుపమా పరమేశ్వరన్ జంటగా రూపొందిన ‘కార్తికేయ 2’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి రన్ టైమ్‌తో సూపర్ హిట్ మౌత్ టాక్‌తో రన్ అవుతోన్న సంగతి తెలిసిందే.
విడుదలైన మూడు రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల బాట పట్టేసిందంటూ ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక వీకెండ్ అయిపోయాకా కూడా ‘కార్తికేయ 2’ తగ్గేదేలే.. అంటున్నాడట.
యూనిక్ సబ్జెక్ట్ కావడంతో, వీకెండ్‌తో సంబంధం లేకుండానే ప్రేక్షకులు ఎట్రాక్ట్ అవుతున్నారు. చూస్తుంటే, నిఖిల్ ఈ సినిమాతో 50 కోట్ల క్లబ్బులో చేరిపోనున్నాడనీ అంటున్నారు.
ఇప్పటికే 35 కోట్లకు పైగా కొల్లగొట్టిన ‘కార్తికేయ 2’, జోరు ఇలాగే సాగితే, త్వరలోనే 50 కోట్ల క్లబ్బులో చేరిపోనుందని అంటున్నారు. మొత్తానికి ఎలాగైతేనేం, నిఖిల్ గట్టిగా కొట్టాడు ‘కార్తికేయ 2’తో.
అన్నట్లు సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘బింబిసార’ సినిమాకి మించి ‘కార్తికేయ 2’ మంచి వసూళ్లు కొల్లగొట్టిందన్న టాక్ వినిపిస్తోంది. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, ‘కార్తికేయ’ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







