హాస్పిటల్లో క్యాష్‌లెస్ సౌకర్యం
- April 14, 2016
హమాద్ మెడికల్ కార్పొరేషన్, కొత్త క్యాష్‌లెస్ పేమెంట్ సిస్టమ్‌ని ఔట్ పేషెంట్ అపాయింట్మెంట్స్ కోసం విమెన్స్ హాస్పిటల్లో ఏర్పాట్లు చేసింది. క్రెడిట్, డెబిట్ లేదా ఇ-క్యాష్ కార్డ్ ద్వారా ఔట్ పేషెంట్లు అపాయింట్మెంట్ పొందవచ్చు. ఖతార్ నేషనల్ బ్యాంక్‌లో 20 ఖతారీ రియాల్స్‌కి న్యూ కార్డ్ (ఇ-క్యాష్ కార్డ్) లభిస్తుంది. ఆపైన, టాపప్ చేయించుకోవచ్చు. ఇది ప్రభుత్వ సర్వీసులను వినియోగించుకునేందుకూ ఉపయోగపడుతుంది. క్యాషియర్ వద్దకు వెళ్ళకుండానే కౌంటర్ వద్ద ఈ కార్డుల ద్వారా రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఫార్మసీలలో కూడా ఈ కార్డులు ఉపయోగపడతాయి. విజిటర్స్‌కి సమయం వృధా కాకుండా ఈ కొత్త విధానాన్ని అమలులోకి తీసుకొచ్చినట్లు విమెన్స్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మైక్ రిచ్‌మౌండ్ తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







