రహస్యంగా సమావేశం నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై దాడులు : 40 మందిని హతం
- April 15, 2016
తమ వైమానిక దళం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థను గట్టి దెబ్బకొట్టిందని అఫ్ఘనిస్థాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. రహస్యంగా సమావేశం నిర్వహిస్తున్న ఉగ్రవాదులపై దాడులు జరిపి దాదాపు 40 మందిని హతం చేశామని వెల్లడించింది.రక్షణ శాఖ అధికార ప్రతినిధి జనరల్ దాలత్ వజిరి ఈ వివరాలు తెలియజేస్తూ గురువారం రాత్రి అచిన్ జిల్లాలోని పిఖా లాతాబాండ్ లో ఉగ్రవాదులంతా సమావేశమై చర్చించుకుండగా తమ వైమానిక దళం నేర్పుగా దాడులు చేసిందని, ఈ దాడుల్లో 40మంది మృతి చెందగా పలువురు గాయపడినట్లు తెలిపారు. వీరిలో ఎక్కువమంది విదేశాల నుంచి ఐసిస్ రిక్రూట్ చేసుకున్నవారే ఉన్నారని వెల్లడించారు. వీరిలో చాలామందిని స్థానికులు తీసుకొని వెళ్లారని, ఉగ్రవాద సంస్థకు మృతదేహాలను అప్పగించారని అన్నారు.
తాజా వార్తలు
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన
- జూలై 9 నుంచి మస్కట్–అబుదాబి మధ్య ఒమన్ ఎయిర్ రోజువారీ విమాన సర్వీసులు
- తెలంగాణ ఉద్యోగులకు భద్రతే భరోసా..
- FIFA ప్రపంచ కప్ ట్రోఫీ విలువ ఎంతో తెలుసా?
- పాస్పోర్ట్ ఫీజుల భారీ పెంపు
- కార్మికుల కోసం దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో మూడు వినూత్న ప్రాజెక్టులు..
- ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘అవర్ ఫ్లెక్సిబుల్ సమ్మర్’ కార్యక్రమం అమలు ప్రారంభించిన దుబాయ్







