భారత్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు పాకిస్తానీల కాల్చివేత

- August 23, 2022 , by Maagulf
భారత్‌లోకి అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు పాకిస్తానీల కాల్చివేత

న్యూ ఢిల్లీ: భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు పాకిస్తానీలను ఇండియన్ ఆర్మీ కాల్చి చంపింది. జమ్ము-కాశ్మీర్, రాజౌరి జిల్లా, నౌషేరా సెక్టార్ పరిధిలోని ఎల్ఓసీ వద్ద సోమవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగింది. సోమవారం సరిహద్దులో భద్రతా దళం గస్తీ కాస్తుండగా, ఇద్దరు పాకిస్తానీలు దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నించారు.

రాత్రిపూట చీకట్లో సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా, ఒక ల్యాండ్‌మైన్ పేలింది. ఇది గుర్తించిన సైన్యం వెంటనే అప్రమత్తమైంది. సరిహద్దు వెంట గస్తీ నిర్వహించింది. ఈ దశలో ఇద్దరు చొరబాటుదారుల్ని గుర్తించిన సైన్యం వారిపై కాల్పులు జరిపింది. ఈ ఘటనలో ఇద్దరు చొరబాటుదారులు మరణించారు. వీరిద్దరినీ తీవ్రవాదులుగా అనుమానిస్తున్నారు. తర్వాత వారి మృతదేహాల్ని సైన్యం స్వాధీనం చేసుకుంది.

ఈ ప్రాంతంలో ఇంకెవరైనా చొరబాటుదారులు వచ్చారా అనే కోణంలో అన్ని చోట్లా మరింత భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు సైనికాధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com