హమ్మయ్యా.! ‘పుష్ప 2’ ఇప్పుడైనా ముందుకు కదిలినట్లేనా.!
- August 23, 2022
అనుకోకుండా ‘పుష్ప’ అనూహ్యమైన విజయం అందుకుంది. నిజంగా చెప్పాలంటే, ఓ కథా, కాకరకాయ్ లేని సినిమా ఇది. లెక్కల మాస్టారు సుకుమార్ మార్క్ సినిమా కానే కాదిది. కోవిడ్ టైమ్‌లో ఏదో అలా అలా సినిమాని కానిచ్చేసి, ధియేటర్లో వదిలేశారంతే.
లక్కు బాగుంది. కంటెంట్‌తో పని లేకుండా, తప్పులు ఎత్తకుండా, బ్రహ్మండమైన విజయం కట్టబెట్టేశారు ఈ సినిమాకి. నో డౌట్ ఈ సినిమాలో పాటలు అయితే సూపర్ హిట్ అయ్యాయనే చెప్పాలి. బోర్డర్లు దాటి మరీ మంచి విజయం అందుకున్నాయ్ ‘పుష్ప’ పాటలు.
అయితే, తాజా అప్డేట్ ప్రకారం, ఈ సినిమా సెకండ్ పార్ట్ త్వరలో స్టార్ట్ చేయనున్నారట. నిజానికి ఎప్పుడో ఈ సినిమా పట్టాలెక్కేయాలి. కానీ, మొదటి పార్ట్ ఇచ్చిన ఊపుతో రెండో పార్ట్ విషయంలో ఒళ్లు దగ్గర పెట్టుకుని వుంది ‘పుష్ప’ టీమ్. మొదటి పార్ట్‌లో ఎంచకుండానే గ్రహించిన తప్పుల్ని రెండో పార్ట్‌లో చేయకుండా వుండాలని నిర్ణయించుకుంది.
దాంతో సరికొత్త కథ కోసం టైమ్ తీసుకుంది. ఎట్టకేలకు స్ర్కిప్ట్ వర్క్ పూర్తి కావడంతో, తాజాగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసేసింది సుక్కు అండ్ టీమ్. ఇంకేముంది, వీలైనంత త్వరలోనే సినిమాని పట్టాలెక్కించేయడేమ మిగిలుంది. అందుకోసం టీమ్ సర్వం సిద్ధం చేసిందట. చూడాలి మరి, ఇప్పటికైనా ‘పుష్ప 2’ పట్టాలెక్కినట్లేనేమో.!
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







