మొన్న పవన్-రేణు దేశాయ్, ఇప్పుడు ధనుష్ - ఐశ్వర్య: అలా కలిసిపోయారన్నమాట.!
- August 23, 2022
ఔను మేం విడిపోతున్నాం.. అంటూ ఈ మధ్య చాలా జంటలు విడిపోయి సెన్సేషనల్ అయ్యాయ్ సినీ వినీలాకాశంలో. అలాంటి జంటల్లో ఒకరైన ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలిసి కనిపించి, అందర్నీ షాక్‌కి గురి చేసింది.
అదేంటీ.? అభిప్రాయాలు కలవడం లేదంటూ, వారి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు పలికేశారు కదా.. మళ్లీ కలిసిపోవడమేంటీ.? అనుకుంటున్నారా.? అవును నిజమే. జనవరిలో ఈ జంట విడాకులు తీసుకోవడం ద్వారా వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే, వీరికి ఇద్దరు కుమారులున్న సంగతి కూడా తెలిసిందే. వారిలో పెద్ద కొడుకు యాత్ర, స్కూల్ ఈవెంట్‌కి సంబంధించి విడిపోయిన తల్లితండ్రులు ఒక్కటిగా కనిపించారు.
అలా అని కలిసిపోలేదనుకోండి. ఒక్కటిగా కనిపించారంతే. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ జంట కూడా ఇలాగే ఒక్కటిగా కనిపించారు. ఈ జంట కూడా విడాకులు తీసుకుని ఎవరి వ్యక్తిగత జీవితాలు వారు, తమకి నచ్చినట్లుగా జీవిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ, ఈ జంటకు సంతానమైన అకీరానందన్ స్కూల్ ఈవెంట్ కోసం మళ్లీ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలసి కనిపించారు. ఆ ఫోటోలు అప్పుడు అంతే వైరల్ అయ్యాయ్. ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య తమ కుమారులతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
కలిసి కనిపించినంత మాత్రాన ఈ మాజీ దంపతులు మళ్లీ ఒక్కటి కాలేదండోయ్. ఇదంతా కేవలం పిల్లల కోసం మాత్రమే.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







