‘లైగర్’ తో అడ్వాన్స్ బుకింగ్స్ మళ్లీ పుంజుకున్నాయ్‌గా.!
- August 23, 2022
ఈ మధ్య ధియేటర్లలో విడుదలయ్యే సినిమాల పరిస్థితి ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రీ రిలీజ్ బజ్, అడ్వాన్స్ బుకింగ్స్ హవా.. అబ్బో ఓ రేంజ్‌లో వుండేది హంగామా. కానీ, అదంతా ఢమాల్ అయ్యింది.
వరుస ఫ్లాపులు, సినీ ఇండస్ర్టీని ఊపిరి పీల్చుకోనివ్వడం లేదు. అయితే, ఇటీవల వచ్చిన ‘సీతారామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’ తదితర సినిమాల వల్ల మళ్లీ ధియేటర్లు కాస్త కళకళలాడుతున్నాయ్.
దాంతో, రాబోయే సినిమాలకు అడ్వాన్స్ బుకింగ్స్ పెరుగుతున్నాయట. ముఖ్యంగా ‘లైగర్ - ది క్రాస్ బ్రీడ్’ అంటూ భారీ అంచనాల మీద విడుదలవుతున్న ‘లైగర్’కి అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నాయట.
‘సర్కారు వారి పాట’, ‘ఆచార్య’ తదితర సినిమాలతో అడ్వాన్స్ బుకింగ్స్ దారుణంగా పడిపోయాయ్. అంతకు ముందు వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమా తర్వాత ‘ఆర్ఆర్ఆర్’ని పక్కన పెట్టేస్తే, మరే సినిమాకి ఆ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది లేదు.
తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ‘లైగర్’ సినిమాకి ఊహించని విధంగా అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయట. ఆగస్టు 25 న ‘లైగర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ జగన్నాధ్ ఈ సినిమాకి దర్శకుడు. కరణ్ జోహార్‌తో కలిసి, ఛార్మీ ఈ సినిమాని నిర్మిస్తోంది. అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







