తెలంగాణ కరోనా అప్డేట్

- August 23, 2022 , by Maagulf
తెలంగాణ కరోనా అప్డేట్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో (345) పోలిస్తే కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 26వేల 558 మందికి కరోనా పరీక్షలు చేయగా, 376 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 164 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 33 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 26 కేసులు వెల్లడయ్యాయి.

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 406 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీల సంఖ్య అధికంగా ఉండటం ఊరటనిచ్చే అంశం. ఇక కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 32వేల 595 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 25వేల 762 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2వేల 722కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 23వేల 780 మందికి కరోనా పరీక్షలు చేయగా, 345 మందికి పాజిటివ్ గా తేలింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com