తెలంగాణ లో 12 రోజుల పాటు రాహుల్ గాంధీ పాదయాత్ర
- August 24, 2022
న్యూ ఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’ పేరిట దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 07 నుండి తమిళనాడులోని కన్యాకుమారి నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. ఈ యాత్ర దేశవ్యాప్తంగా 150 రోజులపాటు 3,500 కిలోమీటర్లకుపైగా సాగనుంది. కేరళలో 19 రోజులు, కర్ణాటకలో 21 రోజుల తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణలోకి అడుగుపెట్టనున్నారు.
12 రోజులపాటు ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల మీదుగా సుమారు 300-350 కిలోమీటర్ల మేర సాగనుంది. రాయచూర్ మీదుగా నారాయణపేట నియోజకవర్గంలోకి రానున్న రాహుల్ యాత్ర కొడంగల్, పరిగి, వికారాబాద్, జహీరాబాద్, నారాయణ్‌ఖేడ్, జుక్కల్ నియోజకవర్గాల మీదుగా సాగనుంది. బిచ్కుంద, మద్నూరు మీదుగా మహారాష్ట్రలోని డిగ్లూర్‌కు వెళ్లేలా రూట్ మ్యాప్ తయారుచేశారు.
ఇదిలా ఉంటె..కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హెల్త్ చెకప్ కోసం మరోసారి విదేశాలకు వెళ్తున్నారు. ఆమెకు తోడుగా రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ కూడా వెళ్లనున్నారు.ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలియజేసింది. సెప్టెంబర్ 4న ఢిల్లీలో జరిగే ‘మెహంగాయ్ పర్ హల్లా బోల్’ ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







