మీపై ట్రావెల్ బ్యాన్ ఉందో లేదో ఇలా చూసుకోండి..
- August 24, 2022
యూఏఈ: ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవడానికి ముందు, విమానాశ్రయ ఇమ్మిగ్రేషన్ కౌంటర్‌ల వద్ద ఎదురయ్యే సమస్యలను ముందుగానే తెలుసుకోవడం ముఖ్యం. అవసరమైతే మీ ప్రాంతంలోని సమీప ఇమ్మిగ్రేషన్/పోలీస్ కార్యాలయాన్ని సంప్రదించాలని యూఏఈ ఇమ్మిగ్రేషన్ విభాగం సూచించింది. అబుదాబిలోని న్యాయ శాఖ 'Estafser' అనే ఆన్‌లైన్ సర్వీసు ద్వారా మీపై ట్రావెల్ బ్యాన్ ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. దీని కోసం నివాసితులు తమ ఏకీకృత నంబర్‌తో లాగిన్ కావాల్సి ఉంటుంది. అలాగే ఎమిరేట్‌లో ఆర్థిక కేసుల కారణంగా ట్రావెల్ బ్యాన్ ఉందో లేదో చెక్ చేసుకోవడానికి దుబాయ్ పోలీసు వెబ్‌సైట్ లేదా యాప్‌లో ఎమిరేట్స్ ఐడీ ద్వారా ఎంటపై వివరాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా లోన్ లేదా క్రెడిట్ కార్డ్ చెల్లింపుల్లో విఫలమైన పక్షంలో రుణగ్రహితలపై ట్రావెల్ బ్యాన్ విధిస్తారు. దీనితోపాటు క్రిమినల్ కేసులు, వివాదాలు లేదా ఇమ్మిగ్రేషన్ చట్టాల ఉల్లంఘన వంటి కారణంగా కూడా ట్రావెల్ బ్యాన్ విధించే అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ బకాయిలు లేదా లోన్ చెల్లింపుల విషయంలో ఒక వ్యక్తి వరుసగా మూడు వాయిదాలు లేదా ఆరు (మొత్తంలో) చెల్లించడంలో విఫలమైతే డిఫాల్ట్ ఈవెంట్‌గా పరిగణిస్తారని ఆశిష్ మెహతా & అసోసియేట్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ భాగస్వామి ఆశిష్ మెహతా తెలిపారు. ఇలాంటి సమయాల్లో రుణదాతలు కోర్టును ఆశ్రయించవచ్చని, బకాయి మొత్తం Dh10,000 కంటే ఎక్కువ ఉంటే సంబంధిత రుణగ్రహితలు దేశం విడిచిపోకుండా వారిపై ట్రావెల్ బ్యాన్ విధించమని కోర్టును అభ్యర్థించే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







