'తేరి' సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది
- April 15, 2016
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన 'తేరి' సినిమా అమెరికాలో రికార్డులు సృష్టిస్తోంది. మొదటి రోజు ఏకంగా రూ. 1.67 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పటివరకు అక్కడ తమిళంలో విడుదలైన సినిమాల్లో రజనీకాంత్ నటించిన రోబో, లింగా సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా 'తేరి' నిలిచింది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త సంవత్సరానికి సరైన బహుమతి అవుతుందని ఈ సినిమాకు ఉత్తర అమెరికా పంపిణీదారులు సినీగెలాక్సీ చెబుతోంది.అట్లీ దర్శకత్వం వహించిన తేరి సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా తమిళ కొత్త సంవత్సరం సందర్భంగా విడుదలైంది. అమెరికాలో బుధవారమే ప్రీమియర్లను తాకింది. బుధవారం నాటి ప్రీమియర్ షోలోనే ఇది రూ. 1.67 కోట్లు వసూలు చేసినట్లు సినీ గెలాక్సీ ప్రతినిధులు చెప్పారు. ఓ మాజీ పోలీసు అధికారికి, అతడి కూతురికి మధ్య సంబంధం గురించి చెప్పే ఈ సినిమాలో సమంత, అమీజాక్సన్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు.
తాజా వార్తలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- నేపాల్ బాధితులను ఆదుకోవాలని సోనూ సూద్ పిలుపు!
- గోల్కొండలో ఘనంగా సోల్జరథాన్
- ప్రవాస తెలుగు బాలబాలికలకు ఆన్లైన్ ప్రతిభా వేదిక
- UAEలో Starlink vs du, e&: ఖర్చు, వేగం, ప్యాకేజీల్లో తేడాలివే
- UAEలో అన్ని పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పాఠ్యాంశం
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- కాంగోలో విజృంభిస్తున్న ఎబోలా.. 3 వేల దాటిన మరణాలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా







