ఆ తమిళ హీరోతో రష్మిక చెట్టా పట్టాల్.!
- August 24, 2022
రష్మికా మండన్నా అంటే, నేషనల్ క్రష్. అందుకే ఆమెను క్రష్మిక అని ముద్దుగా ఫ్యాన్స్ పిలుచుకుంటుంటారు. తెలుగులో స్టార్ హీరోయిన్‌గా చెలామణీ అవుతోన్న రష్మిక మండన్నా, అదే జోరును నార్త్‌తో పాటూ, తమిళ నాట కూడా చూపిస్తోంది. నార్త్‌లో ఏకెంగా మూడు సినిమాల్లో నటిస్తోంది రష్మిక మండన్నా.
ఇక కోలీవుడ్ విషయానికి వస్తే, స్టార్ హీరో విజయ్‌తో ఓ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. బైలింగ్వల్ మూవీగా రూపొందుతోంది ఈ సినిమా. ‘వారసుడు’ టైటిల్‌తో తెలుగులో రిలీజ్ అవుతోంది.
కాగా, తమిళ యంగ్ హీరో శివ కార్తికేయన్‌తో రష్మిక ఓ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించి కొన్ని పోస్టర్లు నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయ్. పోస్టర్లు చూస్తుంటే, ఆన్ స్క్రీన్ శివ కార్తికేయన్‌తో రష్మిక కెమిస్ర్టీ అదిరిపోనుందని అర్ధమైపోతోంది.
ఆన్ స్ర్కీన్ ఓకే. ఆఫ్ స్ర్కీన్ సంగతేంటీ.? ఆఫ్ స్ర్కీన్ కూడా రష్మిక, శివకార్తికేయన్‌తో చెట్టా పట్టాలేసుకుని తిరుగుతోందట. ఇది చూసి సోషల్ కోడి కారు కూతలు మొదలెట్టేసింది. అయితేనేం, ఇదే విషయాన్ని రష్మిక వద్దకు తీసుకెళ్తే, ఆమె నుంచి వచ్చే ఆన్సర్, ‘నేనే ఏ సినిమా చేసినా ఆ హీరోతో కాస్త క్లోజ్‌గా మూవ్ అవుతుంటాను..’ అని సింపుల్‌గా సమాధానమిచ్చేస్తుంటుంది. గతంలోనూ పలుమార్లు ఇదే జరిగింది.
అందుకే సోషల్ మీడియాలో ఠముకేస్తున్నా, రష్మిక వద్దకు ఈ న్యూస్ తీసుకెళ్లే సాహసం చేయడం లేదెవ్వరూ. అసలే ఈ మధ్య తనపై వస్తున్న లవ్ ఎఫైర్ల విషయంలో రష్మిక ఎంత ఘాటుగా స్పందించిందో తెలిసిందే కదా.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







