‘రంగ రంగ వైభవంగా’: కేతిక-వైష్ణవ్ తేజ్ మినీ సెలబ్రేషన్.!

- August 24, 2022 , by Maagulf
‘రంగ రంగ వైభవంగా’: కేతిక-వైష్ణవ్ తేజ్ మినీ సెలబ్రేషన్.!

మెగా కాంపౌండ్ నుంచి పరిచయమైన హీరో వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు. తొలి సినిమాకే సూపర్ హీరో అనిపించుకున్నాడీ యంగ్ మెగా డైనమిక్. ఆ తర్వాత నుంచీ వైష్ణవ్ తేజ్ ఎంచుకుంటున్న కథలు కొత్త పంథాలోనే వుంటున్నాయ్.
‘కొండపొలం’ అనే ఓ చిన్న సినిమాలో నటించేశాడు చిన్న గ్యాప్‌లో. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కంటెంట్ పరంగా మంచి విజయం అందుకుందనే చెప్పాలి. ఇక, ఇప్పుడు ‘రంగ రంగ వైభవంగా’ అంటూ ఓ సరికొత్త కథనంతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు వైష్ణవ్ తేజ్.
ఈ సినిమాలో ‘రొమాంటిక్’ భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇద్దరు మెడికోల మధ్య జరిగే ఈగో ఫైట్‌గా ఈ సినిమాని తెరకెక్కించారు. చిన్నప్పటి నుంచీ కలిసి పెరిగిన ఇద్దరు స్నేహితులు.. వీరి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేంత ఇగో. కానీ, వన్ ఫైన్ డే వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.
ఎప్పుడూ గిల్లికజ్జాలతో సాగే వీరి గొడవ ఆధ్యంతం సరదాలు పూయిస్తుంది. సెప్టెంబర్ 2న ఈ సినిమాకి రిలీజ్ స్లాట్ బుక్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. హీరోగా వైష్ణవ్ తేజ్‌కి ‘రంగ రంగ వైభవంగా’ ఓ మంచి స్టెప్ అవుతుందనిపిస్తోంది. ట్రైలర్ ఓ మినీ సెలబ్రేషన్‌లా అనిపిస్తోంది. చూడాలి మరి, సినిమా ఎలా వుండబోతోందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com