షేక్ మొహమ్మద్ పాలనకు 101 రోజులు
- August 25, 2022
యూఏఈ: షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 101 రోజులు పూర్తయిన సందర్భంగా ఉప ప్రధాన మంత్రి, అంతర్గత వ్యవహారాల మంత్రి షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అభినందనలు తెలిపారు. ఫెడరల్ సుప్రీం కౌన్సిల్ మే 14న యూఏఈ మూడవ అధ్యక్షుడిగా షేక్ మొహమ్మద్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న విషయం తెలినిందే. మే 13న 73వ ఏట మరణించిన తన సోదరుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. జూలై 2022లో షేక్ మొహమ్మద్ తక్కువ-ఆదాయ పౌరుల కోసం సామాజిక మద్దతు కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన బడ్జెట్‌ను Dh14 బిలియన్ నుండి Dh28 బిలియన్లకు పెంచారు. ఈ ఫండ్ ద్వారా గృహనిర్మాణం, విశ్వవిద్యాలయ విద్య, 45 ఏళ్లు పైబడిన నిరుద్యోగ పౌరులకు కొత్త పథకాలను రూపకల్పన చేశారు. అలాగే ఇంధనం, ఆహారం, నీరు, విద్యుత్తు కోసం సబ్సిడీలను కూడా ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా పరిమిత ఆదాయం ఉన్న పౌరులకు మంచి జీవనోపాధిని కల్పించాలనే ఉద్దేశించి అలవెన్సులను ప్రకటించారని షేక్ సైఫ్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన అభినందన సందేశంలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







