కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం..
- August 25, 2022
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు ఢీ కొన్నాయి.ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 12 మంది తీవ్రగాయాలయ్యాయి. నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడినవారిని తుమకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. గత అర్ధరాత్రి సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది. మృతులంతా రాయచూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో క్రూయిజర్ జీపులో 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







